మైమ్ మిమిక్రీతో చంపేసిన ముమైత్‌

Tuesday, September 4th, 2018, 11:36:05 PM IST

ఇంత‌కీ ముమైత్ ఏమైంది? డ‌్ర‌గ్స్ స్కాండ‌ల్‌లో ప్ర‌ధానంగా ఈ ఐటెమ్‌ భామ పేరు వినిపించ‌డంతో అటుపై ఏమైందో తిరిగి క‌నిపించ‌నేలేదు. అయితే ఆ మ‌ధ్య‌లోనే డ్ర‌గ్ అడిక్ష‌న్ నుంచి ట్రీట్ మెంట్ తీసుకుని బాగ‌వుతున్న‌ట్టే క‌నిపిస్తోందంటూ ప్ర‌చారం సాగింది. అన్న‌ట్టు.. ముమైత్ మునుముందు ఏం చేయాల‌నుకుంటోంది? అని వెతికితే ఈ అమ్మ‌డి ఫేస్ బుక్‌లో చాలానే సిమాలు క‌నిపించాయి. మ‌ళ్లీ న‌టించాల‌న్న ఆశ కూడా వ్య‌క్తం చేసింది. అయితే ఈ వీడియో పోస్ట్ చేసి ఏడు నెల‌లైనా ఇంకా ఏ అవ‌కాశం రాలేదు.

ఇక ఎఫ్‌బీలో ముమైత్ మైమ్ మిమిక్రీతో తాట తీసింది. ర‌క‌ర‌కాల వేష‌ధార‌ణ‌ల‌తో అబ్బో అనిపించింది. అంతేకాదు మునుప‌టితో పోలిస్తే ఛామ్‌లో చాలానే మార్పొచ్చింది. ఆ రంగులో కూడా ఏదో తేడా క‌నిపిస్తోంది. మొత్తానికి ముమైత్‌లో మార్పు స్ప‌ష్టంగా కొట్టొచ్చిన‌ట్టే క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఎఫ్‌బీలో మైమ్ మిమిక్రీతో పాశ్చాత్య పోక‌డ‌ల్ని మ‌రోసారి చూపించడం చూస్తుంటే ఈ అమ్మ‌డిలో ఇన్న‌ర్‌గా ఏ మార్పూ రాలేద‌ని మాత్రం అర్థ‌మ‌వుతోంది. మార్పు అంటే అంత‌ర్గ‌తంగా, బాహ్యంగానూ మ్యాడ‌మ్‌!

  •  
  •  
  •  
  •  

Comments