తెలంగాణలో మినీ పురపోరు ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Friday, April 30th, 2021, 07:35:24 AM IST

తెలంగాణ రాష్ట్రం లో మినీ పురపొరు ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. వరంగల్ నగర పాలకసంస్థ, ఖమ్మం నగరపాలక సంస్థ, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్ జడ్చర్ల, కొత్తూరు పురపాలక సంఘాలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభం అయిన ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అయితే ఈ ఎన్నికల్లో మొత్తం 11,34,032 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నాడు జిల్లా కలెక్టర్ లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మరియు పురపాలక కమిషనర్ల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియ గురించి పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించింది.

ఆయితే ఎన్నికల ప్రక్రియ కోవిద్ నిబంధనల తో జరగనున్నాయి. ఎన్నికల విధుల్లో ఉన్నవారు, ఓటర్లు తమ మాస్క్ లని ధరించాలి అని ముందుగా అధికారులు సూచించారు. పోలింగ్ కేంద్రానికి లోపలా మరియు వెలుపలా భౌతిక దూరం పాటించాలి అని తెలిపారు. అయితే ఎక్కడా కూడా గుమికుడా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సమీక్ష లో ప్రకటించారు.