వీడియో: స‌్టార్‌హీరో బ్రో ఖ‌త‌ర్నాక్ వేషాలు!

Friday, April 13th, 2018, 11:31:28 PM IST

షాహిద్ క‌పూర్ ఇటీవ‌లే ప‌ద్మావ‌త్ చిత్రంలో రానా ర‌త‌న్‌సింగ్ రావ‌ల్ పాత్ర‌లో అద్భుతంగా అభిన‌యించాడు. బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒక‌డిగా ద‌శాబ్ధాల పాటు వెలుగులు ప్ర‌స‌రిస్తున్న ఈ హీరో త‌న సోద‌రుడు ఇషాన్‌ని హీరోగా ప‌రిచయం చేస్తున్నాడు. ఆ క్ర‌మంలోనే ఆ కుర్రాడి పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో? అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అత‌డు న‌టిస్తున్న తొలి చిత్రం `ధ‌డ‌క్‌` త్వ‌ర‌లో రిలీజ్‌కి రానుంది.

అంత‌కుముందే ఇషాన్ న‌టించిన `బియాండ్ ది క్లౌడ్స్‌` అంత‌ర్జాతీయ సినీవేదిక‌పై రిలీజ‌వుతోంది. ఇషాన్ తొలి చిత్రం ఓ ర‌కంగా ఇదే. అయితే ఇది హాలీవుడ్ సినిమా. హిందీలోనూ అంతే భారీగా రిలీజ‌వుతోంది. ఇక‌పోతే ఈ చిత్రానికి ఇరానియ‌న్ ఫిలింమేక‌ర్ మాజిది మాజిది ద‌ర్శ‌క‌త్వం, ఏ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం పెద్ద ప్ల‌స్ కానున్నాయి. మురికివాడ బ్యాక్‌డ్రాప్‌లో ఇదివ‌ర‌కూ రిలీజ్ చేసిన టీజ‌ర్‌కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. దాంతో పాటే ఓ పాట‌కు రెస్పాన్స్ అదిరింది. `ఏ చోటి మోటార్ చాలా.. ` సాంగ్‌కి యూట్యూబ్లో అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. దీనికి యూట్యూబ్‌లో ఇప్ప‌టికే సుమారు 3 కోట్ల వ్యూస్ ద‌క్కాయి. తాజాగా ప్ర‌భుదేవా సినిమా `ప్రేమికుడు`లోని `ముక్కాలా ముక్కాబులా.. సాంగ్ బిట్‌కి ఇషాన్ పెర్ఫామెన్స్‌ని రిలీజ్ చేశారు. ఇషాన్‌లో ఖ‌త‌ర్నాక్ వేషాల‌న్నీ ఇందులో క‌నిపిస్తున్నాయి. ఇత‌గాడిని చూస్తే, అన్న‌ను మించిన త‌మ్ముడు అనిపించుకోవ‌డం ఖాయ‌మ‌ని అర్థ‌మ‌వుతోంది.