చిరంజివి భయం వల్లే స్టాలిన్ సరిగ్గా రాలేదు : మురగదాస్

Wednesday, September 27th, 2017, 05:21:16 PM IST


గజినీ సినిమాతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఏర్.మురగదాస్. కెరీర్ మొదట్లో వరుసగా మూడు హ్యాట్రిక్ సినిమాలను తీసి.. మెగాస్టార్ తో సినిమాను చేసే ఛాన్స్ కొట్టేశాడు. గజినీ సినిమా చుసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి దర్శకుడికి ఫిదా అయిపోయి అఫర్ ఇచ్చాడు. దీంతో మురగదాస్ స్టాలిన్ కాన్సెప్ట్ ను చెప్పి మెప్పించాడు. ఆ సినిమాపై అప్పట్లో భారీ అంచనాలు పెరిగాయి. ఎందుకంటే మురగదాస్ గజినీ సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. అలాగే మెగాస్టార్ శంకర్ దాదా ఎంబిబిఎస్ వంటి హిట్ తర్వాత స్టాలిన్ తో వస్తుండడంతో ప్రేక్షకులు భారి అంచనాలను పెంచుకున్నారు.

కానీ సినిమా అనుకున్నంతగా హిట్ అవ్వలేదు. పూర్తిగా నిరాశపడటంతో మెగాస్టార్ కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఆ సినిమా అపజయానికి కారణాన్ని దర్శకుడు మురగదాస్ చెప్పాడు.మెగాస్టార్ తో చేస్తున్నపుడు చాలా భయపడ్డానని తెలిపాడు. ఎందుకంటే తనకు అంతగా అనుభవం లేకపోవడం అలాగే వయసులో కూడా చిరు కంటే చిన్నవాడిని మెగాస్టార్ వంటి హీరోను డైరెక్ట్ చేయానికి ఇబ్బంది కలిగిందని చెప్పాడు. కానీ చిరంజీవి తనను చాలా సపోర్ట్ చేసినప్పటికీ స్టాలిన్ షూటింగ్ విషయంలో మిస్టేక్ జరిగిందని చెప్పారు .కానీ స్పైడర్ విషయంలో ఆ తప్పులు జరగలేదని చెప్పాడు. ఎందుకంటే మహేష్ తనకు ముందునుంచే తెలుసనీ వయసులో కూడా ఇద్దరం సమానమని చెబుతూ.. షూటింగ్ లో ఎటువంటి ఇబ్బంది పడలేదని వివరించాడు

Comments