కేఏ పాల్ పై నమోదైన మర్డర్ కేసు

Monday, August 19th, 2019, 10:48:22 PM IST

ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒకరకమైన సంచలనాన్ని సృష్టించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిపై ఒక మర్డర్ కేసు నమోదయింది. అంతేకాకుండా తనపైన నం బెయిలబుల్ అరెస్టు వారెంటు కూడా జారీ అయింది. కాగా కేఏ పాల్, తన సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో తొమ్మిదవ నిందితుడుగా ఉన్నటువంటి పాల్‌పై మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు నేడు ఒక వారెంట్ ను జారీ చేసింది. కాగా నేడు ఈ కేసులో విచారణ కి మిగిలిన నిందితులతో పాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హాజరు కాకపోవడంతో అక్కడి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటును జారీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, కేఏ పాల్ తమ్ముడు డేవిడ్ రాజు 2010 ఫిబ్రవరిలో కొమ్మిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపై ఆగిఉన్న కారులో అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి మనకు తెలిసిందే. అయితే అక్కడ లభ్యమైన కారులో ముందు సీట్లో డేవిడ్ రాజు శవం పది ఉంది. కాగా మొదట అనుమాస్పద మరణంగా కేసుని నమోదు చేసిన పోలీసులు తమ విచారణలో భాగంగా కొందరిపై హత్య కేసు దాఖలు చేశారు. కాగా నేడు విచారణలో భాగంగా హతుడి సోదరుడైన పాల్ పై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు కోర్టు జరీ చేసింది.

అయితే డేవిడ్ రాజు స్వయానా కేఏ పాల్ సోదరుడు. కాగా వారిరువురి మధ్యన చాలా కాలంగా ఆస్థి సంబంధిత తగాదాలు జరుగుతున్నాయని, ఇలాంటి నేపథ్యంలోనే పాల్ సోదరుడైన డేవిడ్ రాజు హత్య చోటు చేసుకుందని పోలీసులు ముందుగా భావించారు. దాంతో కేవలం ఆస్తి తగాదాల కారణంగానే డేవిడ్ రాజును కేఏ పాల్ హత్య చేసి ఉంటాడని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విషయంలో విచారణ కోసం కోర్టుకు హాజరవ్వాల్సిందిగా మహబూబ్ నగర్ న్యాయస్థానం కేఏ పాల్‌కు పలు మార్లు సూచించినప్పటికీ కూడా కేఏ పాల్ మాత్రం ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆగ్రహించిన కోర్టు కేఏ పాల్ కి నాన్ ముందస్తు బెయిల్ కు అవకాశం లేని విధంగా అరెస్ట్ వారెంట్ జారీచేసింది.