ఆ విషయంలో మురుగదాస్ గ్రేట్ అబ్బా .. ?

Tuesday, November 15th, 2016, 11:18:31 AM IST

murugadoss
ఈ మధ్య సినిమాల బాక్స్ ఆఫీస్ కలక్షన్ రేంజ్ పెరిగింది .. ప్రతి సినిమా వంద కోట్ల క్లబ్ అంటూ .. హంగామా చేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో అయితే ఈ విషయంలో లెక్కే లేదు. ఇప్పటికే బాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ అనేది చాలా తక్కువ .. అక్కడ ఇప్పుడు 500 కోట్ల క్లబ్ సినిమా అంటే దాని క్రేజే వేరు. ఇక ముందుగా ఈ వందకోట్ల క్లబ్ ని క్రియేట్ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా మురుగదాస్ .. అసలు సినిమా వందకోట్ల మార్కెట్ సాధిస్తుందా అన్నవాళ్ల నోరుమూయించి షాక్ ఇచ్చాడు మురుగదాస్ .. ? తెలుగు , తమిళ భాషల్లో సంచలనం రేపిన ”గజినీ” సినిమాను హిందీలో అమీర్ ఖాన్ తో తీసి .. మొదటి వారానికే వందకోట్లు రాబట్టి షాక్ ఇచ్చాడు. వారంలో వందకోట్లు ఏమిటి ? అని బాలీవుడ్ సైతం షాక్ అయింది. అలా ఆ సినిమా ఏకంగా 200 కోట్లు గ్రాస్ వసూలు చేసి బాలీవుడ్ లో మొదటి వందకోట్ల సినిమాగా రికార్డులకెక్కింది. ఈ విషయంలో ఆ టేస్ట్ చూపించిన క్రేజీ దర్శకుడిగా మురుగదాస్ సంచలనం రేపాడు ?