ప్ర‌భాస్ తో సినిమా లేద‌ని తేల్చేసిన ముర‌గ‌దాస్

Wednesday, September 27th, 2017, 10:40:53 AM IST


యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్- ముర‌గ‌దాస్ కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని ఇటీవ‌ల జోరుగా వార్త‌లొచ్చాయి. స్పైడ‌ర్ ప్ర‌మోష‌న్స్‌ లో భాగంగా ముర‌గ‌దాస్ గ‌త నెల రోజుల నుంచి హైద‌రాబాద్ లో మ‌కాం వేశారు. ఈ నేప‌థ్యంలో స్టార్ హీరోల‌ను క‌లుస్తూ ట‌చ్ లో ఉంటున్నారు. దీంతో ముర‌గ‌దాస్ త‌దుప‌రి సినిమా తెలుగులోనే ఉంటుంద‌ని…అదీ ప్రభాస్ తో ముందుగా సినిమా చేస్తున్నార‌ని జోరుగా ప్ర‌చారం సాగింది. అయితే అవ‌న్నీ కేవ‌లం రూమ‌ర్లు మాత్ర‌మేన‌ని ముర‌గ‌దాస్ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కుండ బ‌ద్ద‌లుగొట్టేసారు.

“ప్ర‌భాస్ ను రెండేళ్ల క్రితం స్నేహ పూర్వ‌కంగా క‌లిసాను. మ‌ళ్లీ ఆయ‌న్ను క‌ల‌వ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో సినిమా చేసే ఆలోచ‌న లేదు. త‌మిళ్‌లో నేను క‌మిట్ అయిన సినిమాలున్నాయి. త‌మిళ్‌లో కొంద‌రు సూప‌ర్‌స్టార్ల‌కు క‌థ‌లు చెప్పాను. కానీ కాల్షీట్లు స‌ర్దుబాటు కాలేదు. స్టార్ల‌ వీలును బ‌ట్టి నా త‌దుప‌రి సినిమా ఉంటుంది“ అని తెలిపారు. మురుగ‌దాస్ వ్యాఖ్యానాన్ని బ‌ట్టి ఈసారి త‌మిళ సూప‌ర్‌స్టార్‌తో సినిమా ఉంటుంద‌ని భావించ‌వ‌చ్చు. అయితే ఆ సూప‌ర్‌స్టార్ ఎవ‌రై ఉంటారో చూడాలి. ఇప్ప‌టికే విజ‌య్‌తో సినిమా ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో త‌న‌తోనే చేస్తాడా? అన్న‌ది వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments