ఇప్పుడు.. స్పైడర్ రీమేక్ ఎందుకు సామి ?

Wednesday, June 13th, 2018, 02:04:19 AM IST

సూపర్ స్టార్ మహెష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడర్ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. తమిళంలో అయితే ఫరవాలేదు అనే టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు నిర్మాతలు కానీ వారికి తీవ్ర నిరాశనే మిగిల్చిన ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ కానుందట !! నిజానికి మొదటే హిందీ వెర్షన్ కూడా ప్లాన్ చేసారు .. కానీ సినిమా ఫలితం తారుమారవడంతో హిందీ విషయాన్నీ పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు హిందీలో ఈ సినిమాను రీమేక్ చేస్తానని అంటున్నాడు మురుగదాస్ ? సినిమా విడుదలై చాలా రోజులే అవుతుంది .. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాను రీమేక్ చేస్తానని చెప్పడం షాకిస్తుంది. ఇక మురుగదాస్ ఈ సినిమాను ఏ హీరోతో ఎప్పుడు మొదలు పెడతా అన్నది త్వరలోనే చేబుతాడట. మరి ఒక ప్లాప్ అయిన సినిమాను ఇప్పుడు రీమేక్ చేస్తాననడం ఆసక్తి రేపుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments