హీరోయిన్ తో దేవి శ్రీ ప్రాసాద్ ప్రేమాయణం ?

Saturday, February 24th, 2018, 05:11:38 PM IST

సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ ప్రేమలో పడ్డాడట !! ఎంటి షాక్ అవుతున్నారా ? మీరు వింటున్నది నిజమే .. గత కొంత కాలంగా పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నా కూడా పెళ్లి విషయాన్నీ పక్కన పెట్టిన దేవి తాజాగా ప్రేమలో పడ్డాడని వార్తలు వస్తున్నాయి. ఇన్నో రోజులు నచ్చిన అమ్మాయికోసం చూశాడని .. ఇప్పుడు ఒక అమ్మాయి నచ్చడంతో ఆమె ప్రేమలో పడ్డాడట, ఇంతకీ దేవిని లవ్ లో పడేసింది ఎవరో తెలుసా .. పూజిత. ప్రస్తుతం రంగస్థలంలో రామ్ చరణ్ చెల్లిగా నటిస్తున్న పూజిత అంతకు ముందు సుకుమార్ నిర్మించిన దర్శకుడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమెను మొదటి చూపులోనే ప్రేమలో పడ్డ దేవి ఆమెతో డీప్ లవ్ లో ఉన్నాడని త్వరలోనే వీరిద్దరి పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.