పుకార్లకు చెక్ పెట్టిన మ్యూజిక్ డైరెక్టర్!

Monday, March 5th, 2018, 08:59:31 PM IST


స్టార్ రైటర్ కం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ ల కంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రం ఎంతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుందో తెలిసిందే. అయితే ఆ చిత్రం తరువాత తాను ఎన్టీఆర్ ఎన్టీఆర్‌తో తీయబోయే చిత్రం పై త్రివిక్రమ్ బాగా ఫోకస్ చేస్తున్నాడు. ప్రతి విషయం లోను గట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ చేతులమీదుగా ముహూర్తం జరుగుపూకునా ఈ చిత్రంకు మొదట కోలీవుడ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ రవిచందర్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్యాంగా అతన్ని తప్పించటంతో ఆ స్థానంలో థమన్‌ వచ్చి చేరాడు.

అజ్ఞాతవాసితో అనిరుధ్‌ నిరుత్సాహపరిచాడని, అందుకే త్రివిక్రమ్‌ అతన్ని తప్పించడంటూ ఇండస్ట్రీ లో టాక్‌ వినిపించింది. ఈ విషయమై అనిరుధ్‌ హర్టయ్యాడని, ఇకపై అసలు తెలుగు ప్రాజెక్టులే ఓకే చేయకూడదని నిర్ణయించుకున్నాడంటూ రకరకాల పుకార్లు షికారు చేశాయి. కానీ, ఇప్పుడు వాటన్నింటికి చెక్ పెడుతూ ఆ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు.

గురూజీ, తారక్‌, థమన్‌, చిత్ర నిర్మాతలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు, చిత్రం ఘన విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అంటూ అనిరుధ్‌ ట్వీట్‌ చేశాడు. కాగా ఈ చిత్రం కోసం హీరోయిన్‌గా పూజాహెగ్డేను తీసుకున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ హారికా &హాసిని క్రియేషన్స్‌ వాళ్లు అధికారికంగా ప్రకటించారు. త్వరలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రయానికి పనిచేసే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది….