వైరల్ న్యూస్ : ఒక చర్చిలో నమాజ్ చేస్తున్న ముస్లింలు

Monday, December 30th, 2019, 12:54:39 PM IST

తిరువనంతపురం లోని ఒక చర్చి లో తాజాగా ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కాగా కేరళలోని తిరువనంతపురానికి చెందిన సెయింట్ థామస్ చర్చి క్రైస్తవులకి ప్రసిద్ధమైన ప్రార్థనా మందిరం. అయితే ఈ చర్చి కి వెలుపల ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఎన్ఆర్‌సీ, సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా అక్కడి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. అయితే ఆ నిరసనలో చాలా మంది ముస్లింలు కూడా పాల్గొన్నారు. అయితే వారు నిరసన చేస్తున్న తరుణంలో, ఆ నిరసనలో పాల్గొన్నటువంటి ముస్లింలు వారు ప్రార్థన చేసుకునే టైమ్ అయింది.

కానీ ఆ ముస్లింలు వారి మసీద్ కి వెళ్లి, నమాజ్ చేయాలంటే సమయం దాటిపోతుందని ఆలోచిస్తున్న తరుణంలో… ఆ పక్కనే ఉన్నటువంటి సెయింట్ థామస్ చర్చి వారు తమ చర్చిలో ఖాళీ ప్రదేశంలో ప్రార్థనలు చేసుకోండి అని తెలుపుతూ, అందుకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లను కూడా చేశారు. దీంతో ఆ నిరసనలో పాల్గొన్న చాలా మంది ముస్లింలు చర్చి ఆవరణలోని ఖాళీ ప్రదేశంలోకి చేరుకొని ప్రార్థనలు నిర్వహించారు. వారికీ అంత గొప్ప సహాయాన్ని అందించినందుకు ఆ చర్చి సిబ్బందికి ముస్లింలు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అయితే ఈ ఫోటోలు ఇప్పుడు సామజిక మాంద్యమాల్లో వైరల్ గా మారాయి… అయితే ఆ సమయంలో ముస్లిం లకు అంతటి సహాయాన్ని అందించిన చర్చి సిబ్బందికి అందరు కూడా జేజేలు పలుకుతున్నారు. అంతేకాకుండా మతసామరస్యానికి పుట్టిల్లు మా భారత్ అంటూ పలువురు నెటిజన్లు ప్రశంశిస్తున్నారు.