వీడియో: అసెంబ్లీ సెట్ మేకింగ్ చూసి తీరాలి

Sunday, April 29th, 2018, 02:14:21 AM IST

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ `భ‌ర‌త్ అనే నేను` రికార్డుల గురించి విడిగా చెప్పాల్సిన ప‌నేలేదు. ఇప్ప‌టికే అందుకున్న ఫ‌లితంతో మహేష్ ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నాడు. బ్ర‌హ్మాస్త్రం, స్పైడ‌ర్ ఇచ్చిన ఝ‌ల‌క్‌ల నుంచి కోలుకుని, రిలీఫ్ ఫీల‌వుతున్నాడు. వ‌ర‌ల్డ్ వైడ్ ఈ చిత్రం 175 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌కు స‌మీపంలో ఉంద‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఆ క్ర‌మంలోనే నేడు హైద‌రాబాద్ నోవోటెల్‌లో భారీ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్ వేడుక‌ను నిర్వ‌హించారు.

ఆ క్ర‌మంలోనే డివివి సంస్థ అధికారిక ట్విట్ట‌ర్లో అసెంబ్లీ సెట్ మేకింగ్ విజువ‌ల్స్‌ని రిలీజ్ చేసింది. సురేష్ సెల్వ‌రాజ‌న్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా ఆయ‌న సార‌థ్యంలో సెట్ డిజైన‌ర్లు ఎంత‌గా శ్ర‌మించారో ఈ విజువ‌ల్స్‌లో చూపించారు. ఒరిజిన‌ల్‌గానే అవిభాజిత ఆంధ్ర ప్ర‌దేశ్ అసెంబ్లీని ప‌రిశీలించి, సేమ్ టు సేమ్ అదే మోడ‌ల్ డెమో సెట్‌ని డిజైన్ చేసుకున్నారు. అటుపై భారీగా సెట్‌ని రూపొందించారు. ఇది ఒరిజిన‌ల్ అసెంబ్లీయేనా? అని ప్రేక్ష‌కులు మాయ‌లో ప‌డేంత గొప్ప‌గా దీనిని తీర్చిదిద్ద‌డంలో సురేష్ అండ్ టీమ్‌కి బోలెడ‌న్ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అసెంబ్లీ సెట్ డిజైనింగ్ వెన‌క ఉన్న ప్లానింగ్‌ను, మేకింగ్ వీడియో రూపంలో భ‌ర‌త్ టీమ్ రిలీజ్ చేసింది. ఇదిగో ఈ వీడియో మీకోసం..

  •  
  •  
  •  
  •  

Comments