అర్జున్ రెడ్డిని మిస్ అయినందుకు ఫీలవుతున్న హీరోయిన్ ?

Monday, January 22nd, 2018, 09:53:26 AM IST

కొత్త దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి టాలీవుడ్ లో కొత్త సంచలనం క్రియేట్ చేసింది. హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా షాలిని పాండే నటించింది. అయితే మొదట ఈ పాత్ర కోసం తమిళ హీరోయిన్ పార్వతి నాయర్ ని అడిగాడట దర్శకుడు .. అయితే ఈ కథ విన్న తరువాత తాను నటించనని చెప్పిందట, ఈ విషయం పై ఓ ఇంటర్వ్యూ లో పార్వతి స్పందిస్తూ .. దర్శకుడు సందీప్ నన్ను కలిసి ఈ కథ గురించి చెప్పాడు. హీరో విజయ్, దర్శకుడు సందీప్ కూడా కొత్త కావడంతో ఈ ప్రాజెక్ట్ గురించి పెద్దగా ఆలోచించలేదు. దానికి తోడు ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఇబ్బందిగా అనిపించాయి .. ముక్యంగా ముద్దు సన్నివేశాలు, కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉండడంతో ఈ సినిమా చేయనని చెప్పను .. ఆ తరువాత సినిమా చూసి షాక్ అయ్యా. దర్శకుడు సందీప్ టాలెంట్ ను అంచనా వేయలేకపోయా.. ఒక రకంగా ఈ సినిమా మిస్ అయినందుకు బాధ పడుతున్నా అని పేర్కొంది.