మా కుటుంబం అలాంటిది కాదు!

Tuesday, September 16th, 2014, 06:24:39 PM IST


ఆంధ్రపదేశ్ పౌర సరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత మంగళవారం విలేకరులసమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిటాల కుటుంబం పదిమందికి మేలు చేసేదే కాని ఎవరి దగ్గరా లాక్కోనేది కాదని వివరించారు. అలాగే ఎవరైనా పరిటాల పేరు చెప్పి బెదిరిస్తే వెంటనే నిర్భయంగా పోలీసులకు పిర్యాదు చెయ్యాలని సునీత సూచించారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ అనంతపురం జిల్లా ధర్మవరంలో తన కుమారుడు శ్రీరాం పేరు చెప్పి ఒక న్యాయవాదిని బెదిరింఛి డబ్బులు డిమాండ్ చేసారని, అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపి, తమకు ఆ సంఘటనకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ఇక రాష్ట్రంలో 16 నుండి 18లక్షల బోగస్ కార్డులను గుర్తించామని సునీత పేర్కొన్నారు. అలాగే లక్ష దీపం కనెక్షన్లు మంజూరు అయినట్లుగా పరిటాల సునీత వివరించారు.