వర్మకి షాక్ ! జీఎస్టీ కథ తనదే అంటున్న రచయిత!

Friday, January 26th, 2018, 12:05:47 PM IST


సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ). ఈ చిత్ర కాన్సెప్ట్ తనదే అని పి. జయకుమార్ అనే రచయిత కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసాడు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్ట్ ఆయన ను మూడు రోజులలోగా వివరణ ఇవ్వాలని గురువారం నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై రచయిత జయకుమార్ మీడియా తో మాట్లాడుతూ 2015 ఏప్రిల్ 1 న తాను ఈ జీఎస్టీ స్క్రిప్ట్ ను వర్మకు పంపానని, వర్మ నుండి ఎలాంటి స్పందన వస్తుందో అని అప్పటినుండి ఎదురుచూస్తున్న నాకు అప్పటినుండి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదని, అయితే వున్నట్లుండి నా స్క్రిప్టుని ఆయన కొంచెం కూడా మార్పు చేయకుండా లఘు చిత్రంగా రూపొందించడం తెలుసుకుని షాక్ కు గురయ్యానని, నా స్క్రిప్ట్ ని దొంగిలించి ఆయన ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారని, తనకు తగిన న్యాయం జరిగేలా చూడమని కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. అయితే దీనిపై వర్మ స్పందిస్తూ జయకుమార్ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదంటున్నారు. నిజానికి జయకుమార్ తన కార్యాలయంలో పనిచేశాడని, అతను ఒక దొంగ అని, పలుమార్లు దొంగతనం చేస్తూ పట్టుబడ్డా వదిలేసానని, చివరకు 10 నెలల క్రితమే తనని విధుల నుండి తొలగించామని చెప్పుకొచ్చారు. తన పై ఇంత పెద్ద నింద వేసిన జయకుమార్ పై ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.ఈ చిత్రం నేడు ఇంటర్నెట్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే. కానీ కోర్ట్ నోటీసుల నేపథ్యంలో అసలు చిత్రం అసలు విడులవుతుందా లేదా అనే అనుమానాలు ప్రేక్షకుల్లో మొదలయినట్లు తెలుస్తోంది.