నా కొడుకు దేశం గర్వపడేలా చేసాడు: హీరో మాధవన్

Tuesday, April 10th, 2018, 12:09:45 PM IST

ఢిల్లీకి రాజు అయిన తండ్రికి కొడుకే కదా..! మరి ఆ కొడుకు సాధించిన విజయాన్ని చూస్తే ఏ తండ్రి అయిన గర్వంగా ఫీల్ కాకుండా ఉంటాడా. మరి తమిళ హీరో మాధవన్ కూడా ఇప్పుడు అంతే గర్వంగా ఫీలవుతున్నాడు. మాధవన్-సరితల పుత్ర రత్నం వేదాంత్(12) థాయిలాండ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో … 1500 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీ పడ్డాడు. మూడో స్థానంలో నిలిచిన వేదాంత్ కాంస్యపతకం సొంతం చేసుకున్నాడు. ఈ సంద‌ర్భంగా మాధ‌వ‌న్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొడుకు కాంస్య ప‌తాకం సాధించిన ఫోటోని షేర్ చేస్తూ.. నా తో పాటు భార్య స‌రిత గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం ఇది. మా పుత్ర‌ర‌త్నం థాయిలాండ్ అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీలలో మనదేశానికి కాంస్యపతకం సాధించిపెట్టాడు అని అన్నాడు. దీంతో వేదాంత్‌కి అభిమానులే కాదు సినీ సెల‌బ్రిటీలు కూడా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. గ‌తంలోను స్విమ్మథాన్ లో 4 కిలో మీటర్ల స్విమ్ పోటీను కేవలం 57 నిమిషాల్లోనే పూర్తి చేసిన వేదాంత్‌ని చూసి గర్వంగా ఫీలైన మాధవన్.. తండ్రిగా చాలా ప్రౌడ్‌ గా ఫీలయ్యే క్షణాలివి అంటూ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవల త‌న భుజానికి శ‌స్త్ర చికిత్స చేయించుకున్నాడు మాధ‌వ‌న్‌. తెలుగులో స‌వ్య‌సాచి చిత్రంలో న‌టిస్తున్న మాధ‌వ‌న్.. గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్నాడు. చివ‌రి సారిగా విక్ర‌మ్ వేద చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మాధ‌వ‌న్ త్వ‌ర‌లో ఒండ్ర‌గా అనే త‌మిళ చిత్రంతో పాటు చంద‌మామ దూర్ కే అనే హిందీ చిత్రంలోను న‌టించ‌నున్నాడు. హిందీ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌, న‌వాజుద్ధీన్ సిద్ధిఖీ ముఖ్య పాత్ర‌లు పోషించనున్నారు.