నా వ్యాఖ్యలను అప్పటి మీడియా తప్పుగా రాసింది : సీనియర్ యాక్టర్ నరసింహరాజు

Wednesday, April 11th, 2018, 12:46:36 PM IST

సీనియర్ యాక్టర్ నరసింహరాజు పేరు వింటే అప్పట్లో వచ్చిన జగన్మోహిని, తాతయ్య కంకణం, వంటి సోషియో ఫాంటసీ చిత్రాలు గుర్తుకు వస్తాయి. అటువంటి చిత్రాలతో ఆయన మంచి పేరు సందించినప్పటికీ, తరువాత ఆయనకు అవకాశాలు ఊహించినంతగా రాలేదనే చెప్పాలి. ఆ సమయంలో అప్పటి పెద్దహీరోలపై ఆయన చేసిన ఒక వ్యాఖ్య పెను సంచలనమే రేపింది. విషయంలోకి వెళితే, ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో తుపానుతో భారీ నష్టం వచ్చింది. దీంతో వారికి సాయం చేయడం కోసం ఎన్టీఆర్, ఏఎన్నార్ నడుంబిగించారు. ప్రేక్షక దేవుళ్ల వల్లే మనం ఈ స్టేజ్‌లో ఉన్నాం. వారి కోసం ఊరూరా తిరిగి చందాలు పోగు చేద్దాం అని డిసైడ్ అయ్యారు.

దీనిపై అప్పట్లో సీనియర్ నటుడు నరసింహరాజు ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్ పెను సంచలనమైంది. అయితే దీనిపై ఆయన తాజాగా ఓ టివి షోలో నరసింహరాజు వివరణ ఇచ్చారు. అప్పట్లో నేను అన్నమాటను చాలా పెద్దగా చేసి చూపించారు. యంగ్ ఏజ్ కాబట్టి ముక్కుసూటిగా మాట్లాడేవాళ్లం. నాకు అప్పుడు పెద్దగా పరిపక్వత లేదు. అందరికీ వివాదాలే ఇష్టం కాబట్టి అది కాంట్రవర్సీ అయింది. ప్రజలకు కష్టం వచ్చింది కదా! వాళ్ల దగ్గరే డబ్బు పోగు చేసి వాళ్లకే ఇవ్వడం ఎందుకు, పైగా 30రోజుల సమయం కూడా వృథా అవుతుంది.

ఒక సినిమా రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించి, వచ్చిన దాన్ని బాధితులకు ఇవ్వండి. మిగిలిన నటులు ఎవరికి తోచిన మొత్తం వారు ఇస్తే, అంతా కలిపినా, అంతే సొమ్ము అవుతుంది కదా. మనం రోడ్లపైకి వెళ్లి అడిగి ఇబ్బందులు పడటం అవసరమా అని అన్నాను. కానీ దాన్ని చాలా పెద్ద కాంట్రవర్శీ చేశారు అప్పటి మీడియావారు అని నరసింహరాజు వెల్లడించారు……

  •  
  •  
  •  
  •  

Comments