సముద్రం లో వింత జీవి .. వేరే గ్రహం నుంచి వచ్చిందా ?

Saturday, February 25th, 2017, 03:20:48 PM IST


వింతగా ఉండే జీవుల మీద సైంటిస్ట్ లకి మాత్రమే కాదు మనకి కూడా ఆసక్తి ఎక్కువగానే ఉంటూ ఉంటుంది. ఆ జీవులు చంద్రమండలం మీద ఉన్నవి అయితే ఓకే కానీ డైరెక్ట్ గా మన సముద్రం లో తేలుతూ కనిపిస్తే ? ఇంకేమైనా ఉందా ? ఇప్పుడు ఫైల్లిఫీన్స్ లో అదే జరుగుతోంది. సముద్రపు ఒడ్డుకు ఒక భారీ ఆకారం కొట్టుకుని వచ్చింది. పరిశోధకులు అక్కడికి చేరుకొని మరీ పరిశోధనలు జరుపుతున్నారు అంటే ఆ జీవి ఎంత వింతగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.దినాగట్ దీవుల్లోని సముద్రపు ఒడ్డుకు భారీ ఆకారం ఒకటి కొట్టుకు వచ్చింది. సుమారు 20 అడుగుల పొడవు శరీరమంతా తెల్లని వెంట్రుకలతో కూడిన ఈ జంతు కళేబరం చిత్రంగా ఉంది. దీన్ని చూసిన వారిలో కొందరు షాక్ తినగా ఇంకొందరు దానితో సెల్ఫీలు దిగారు ఎప్పుడూ చూడని కొత్త జీవి అంటూ మరికొందరు ఆశ్చర్య పోయారు. అయితే ఈ వార్త ఆ నోటా ఈనోటా అందరికీ పాకడంతో ప్రజల తాకిడి పెరిగిపోయింది. అయితే ఇంటర్నెట్ లో సైతం దీనిపై రకరకాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఓ హాలీవుడ్ చిత్రంలోని యానిమేషన్ క్యారక్టర్ లా ఉందని కొందరు జోక్ చేశారు.