‘నేల టిక్కెట్టు’ ఫెయిల్యూర్ తో ఆందోళనలో మైత్రి మూవీస్ నిర్మాతలు?

Friday, May 25th, 2018, 05:53:46 PM IST

శ్రీమంతుడు చిత్రంతో ఓవర్సీస్ మార్కెట్ లో తెలుగు చిత్రాలను కొని ప్రదర్శించే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సభ్యులు టాలీవుడ్ కి నిర్మాతలుగా పరిచయమైన విషయం అందరికి తెలిసిందే. ఆ తరువాత జనతాగ్యారేజీ, రంగస్థలం తీశారు. మూడు సినిమాలు అద్భుత విజయాలు అందుకోవడంతో ప్రస్తుతం వారు చిత్రాల నిర్మాణాన్ని కొంత వేగవంతం చేశారు. ప్రస్తుతం వీరు నాగ చైతన్యతో సవ్య సాచి, రవితేజ -శ్రీను వైట్ల కంబినేషన్లో ఒక చిత్రం, అలానే రవితేజ- సంతోష్ శ్రీనివాస్ కంబినేషన్లో ఒక చిత్రం, సూపర్ స్టార్ మహేష్ బాబు – సుకుమార్ కంబినేషన్లో ఒక చిత్రం ఇవి కాక మరొక మూడు చిన్న చిత్రాలు ప్లాన్ చేశారు. ఇందులో సవ్యసాచి షూటింగ్ దాదాపుగా పూర్తికాగా రవితేజ – శ్రీను వైట్లల చిత్రం మొన్ననే షూటింగ్ ప్రారంభమయింది. ఇక అసలు విషయం ఏమిటంటే, రవితేజ ఇటీవల రాజా ది గ్రేట్ చిత్రంతో మంచి విజయం అందుకున్నారు.

అయితే తర్వాత వచ్చిన టచ్ చేసి చూడు ఘోర పరాజయంపాలయింది. ఇక నేడు విడుదలయిన నేలటిక్కెట్టు కూడా నెగటివ్ టాక్ సంతరించుకోవడం, అలానే ఆ చిత్రానికి ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ కూడా రాకపోవడంతో ఆయనతో ఏకంగా రెండు చిత్రాలు ప్లాన్ చేసిన మైత్రి సంస్థ నిర్మాతలు ఒకింత ఆలోచనలో పడ్డారని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే వారి ఆందోళనకు మరింత బలం చేకూరేలా ఆయనతో చేస్తున్న రెండు చిత్రాల దర్శకులు అయిన శ్రీను వైట్ల, సంతోష్ శ్రీనివాస్ ఇద్దరూ ప్రస్తుతం ప్లాప్స్ లో వున్న వారు కావడం వారి ఆందోళనను మరింత పెంచుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో వారి నమ్మకాన్ని ఆ దర్శకులు, హీరో రవితేజ ఏ మేరకు నిలబెడతారో తెలియాలంటే ఆ చిత్రాలు పూర్తి అయి విడుదలయేవరకు వేచి చూడక తప్పదు మరి………

  •  
  •  
  •  
  •  

Comments