మాస్ రాజాతో .. ఆ బ్యానర్ బిగ్ డీల్?

Wednesday, May 9th, 2018, 10:50:05 AM IST

మాస్ రాజా రవితేజకు తాజాగా ఓ క్రేజీ అఫర్ దక్కింది. ఆయనతో వరుసగా రెండు సినిమాలు తీసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఓ క్రేజీ బ్యానర్ ఇందుకోసం ఏకంగా 16 కోట్లకు ఈ డీల్ సెట్ చేశారట ? అంటే ఒక్కో సినిమాకు ఏకంగా 8 కోట్ల డీల్ అన్నమాట. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకి ఈ డీల్ ఏ బ్యానర్ కుదుర్చుకుందో తెలుసా .. మైత్రి మూవీ మేకర్స్ ? శ్రీమంతుడు , జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి సంచలన విజయాలతో టాలీవుడ్ లో క్రేజీ బ్యానర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యానర్ లోనే రవితేజ – శ్రీను వైట్ల ల అమర్ అక్బర్ ఆంటోని తెరకెక్కుతుంది. ఈ నేపథ్యంలో ఆయనతో మరో సినిమా చేయడానికి మైత్రి మూవీస్ ఈ డీల్ ని సెట్ చేసిందట. రవితేజ నటించిన నేల టికెట్ త్వరలో విడుదలకు సిద్ధం అయింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు రవితేజ. దాంతో పాటు శ్రీను వైట్లతో చేస్తున్న అమర్ అక్బర్ ఆంటోని చిత్రం షూటింగ్ కూడా అమెరికాలో మొదలు కానుంది.

  •  
  •  
  •  
  •  

Comments