నా నువ్వే ట్రైలర్ : ‘ఇదేం ట్విస్ట్‌ బావా..జ్యోతిష్యానికే జ్వరం వచ్చేలా ఉంది’

Wednesday, May 16th, 2018, 12:53:43 PM IST

నందమూరి కళ్యాన్ రామ్.. ఎన్నో రోజులుగా సినీ ప్రపంచానికి దూరమై మళ్ళీ ఈ మద్యే కొన్ని వైవిధ్య కతానికలతో కొత్త పుంతలు తొక్కుతున్న ఎనర్జిటిక్ హీరో. జిమ్, వ్యామాలు చేసి టోటల్ లుక్ ని సైతం ఒక్కసారిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకొని కుర్ర హీర్రోలకు పోటీనిస్తున్నాడు. ఇదిలా ఉంటె కళ్యాన్ రామ్, మిల్క్ బ్యూటీ తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్ర్తం నా నువ్వే. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా మొదటి చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో కొంత ఉత్ఖంటత నేలకొందనే చెప్పాలి. పోస్టర్స్ లోనే పాజీతీవ్ ఎనర్జీ నింపుకున్న ఈ సినిమాపై భారీ ఒక రొమాంటిక్ అంచనాలున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే జయేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసి శ్రీ రామ్ చక్కని పనితనాన్ని కలబోసాడు. ఇరోజే ఈ సినిమా ట్రైలర్ ను యుట్యుబ్ లో విడుదల చేయగా అతి తక్కువ సమయంలోనే అభిమానుల మన్నేలను అందుకుంది ఈ సినిమా ట్రైలర్. అటు కమర్షియల్ గానూ, ఇటు ఒక మంచి రొమాంటిక్ లవర్ బాయ్ సినిమాగాను చిత్ర ట్రైలర్ అంచనాలను మరింత పెంచగా, శరత్ ఈ సినిమాకి చక్కటి సంగీతాన్ని కూర్చారు. కూల్ బ్రీజ్ సినిమాస్ పతాకం పై కిరణ్ ముప్పారపు, విజయ్ వట్టికూటి ఈ సినిమాకి నిర్మాతలుగా వహించగా ఈ సినిమాకు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను సమర్పిస్తుంది. విడుదలకు సంబంధించి సర్వత్రా సిద్దం చేసుకున్న ఈ చిత్రం మే నెలాకరున తెరపైకి రానుంది.

నటి తమన్నా కళ్యాన్ రామ్ ప్రేమ కోసం ఎంతగా తపిస్తుంది, అతని ప్రేమను ఎలా గెలుచుకుంటుంది అన్న అంశంపై కొంతవరకూ ట్రైలర్ లో చూపించగా ఇదేం ట్విస్టు బావా జ్యోతిష్యానికే జ్వరం వచ్చేలా ఉందన్న వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకు మరింత ఫన్నీ లుక్ తీసుకు వచ్చింది. తపించే క్షణాలకు .. నిరాశే చూపించకు.. నానువ్వే అనే ఫీల్ గుడ్సాంగ్ తో ఎండ్ అయ్యే ఈ ట్రైలర్ సినిమాపై కొత్త హోప్స్ ని పెంచింది. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుండా అన్న విషయంపై వేచి చూడాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments