సెన్సార్ అయ్యాక ఇప్పుడు మెరుగులేంది సామి ?

Friday, May 25th, 2018, 02:54:31 PM IST

ఒక సినిమాకు సెన్సార్ అయిందంటే .. ఇక ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి 100 శాతం సిద్ధం అయినట్టే. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన నా నువ్వే సినిమా విషయంలో మాత్రం కథ మరోలా ఉంది. ఇప్పటికే సెన్సార్ పూర్తయిన ఈ సినిమాను ఈ నెల 25న విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ జూన్ 1కి వాయిదా వేశారు .. మళ్ళీ ఏమైందో ఏమో .. ఆ రోజు కూడా విడుదల ఆలస్యం అయ్యేలా ఉంది. ఈ విషయం పై నిర్మాత మాత్రం .. కొన్ని మెరుగులు దిద్దుతున్నామని చెబుతున్నాడు. నిజానికి నా నువ్వే సినిమా విడుదలకు సూపర్ స్టార్ కాలా అడ్డు పడింది. కాలా సినిమా జూన్ 7న విడుదల చేస్తున్నారు. ఈ నేపధ్యలో నా నువ్వే ముందు విడుదలైతే దాని ఎఫెక్ట్ పడే అవకాశం ఉందన్న ఆలోచనతోనే ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. తమన్నా హీరోయిన్ గా నటించింది.

  •  
  •  
  •  
  •  

Comments