నాపేరు సూర్య ఆడియో వేదిక ఖరారు?

Monday, April 16th, 2018, 04:49:55 PM IST

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా రచయిత వక్కంతం వంశి తొలిసారి మెగా ఫోన్ పడుతున్న సినిమా నా పేరు సూర్య. మొదటి నుండి ఈ సినిమాపై మంచి అంచాలున్నాయి. కాగా ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్ అలానే మూడు పాటలు, ఇటీవల విడుదలయిన డైలాగ్ ఇంపాక్ట్ తో సినిమా పై మరింత అంచనాలు పెరిగాయి. అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో విడుదల తేదీ అలానే వేదిక పై కొద్దిరోజులనుండి చర్చ జరుగుతోంది.

అయితే నేడు ఈ విషయమై ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఆడియో వేడుకని ఈ నెల 22వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం, మిలిటరీ మాధవరంలో జరపటానికి యూనిట్ నిర్ణయించినట్లు సమాచారం. కాగా ఈ ఆడియో విడుదల వేడుకకు ఒక ప్రత్యేక అతిథి ని కూడా పిలవాలని యూనిట్ నిర్ణయించిందని, ఆ అతిథి మరెవరో కాదు స్టార్ ప్రభాస్ అని ప్రస్తుతం సోషల్ మీడియా లో చర్చ జరుగుతోంది. అయితే ఈ వేడుకకు నిజంగా ప్రభాస్ ని ఆహ్వానించారా, ఆయన వస్తున్నారా లేదా అనే దానిపై అధికారిక ప్రకటన వెలువడవలసి వుంది……

  •  
  •  
  •  
  •  

Comments