సూర్యకు భారీ లాస్ తప్పలేదుగా ?

Thursday, June 14th, 2018, 10:55:28 PM IST


అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై అదే రేంజ్ ప్లాప్ ను మూట కట్టుకుంది. అల్లు అర్జున్ కొత్త లుక్ ట్రై చేసి సినిమాకు భారీ హైప్ తెచ్చినా పెద్దగా లాభం లేకపోయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్, కె నాగబాబు కలిసి నిర్మించారు. సినిమా విడుదలకు ముందు భారీ బిజినెస్ జరిగింది కానీ సినిమా భారీ పరాజయాన్ని అందుకోవడంతో అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఈ సినిమా ఏప్రిల్ 27న విడుదలైంది, ఇక సినిమా మొత్తంగా కలక్షన్స్ ను చూసుకుంటే 100 కోట్లు వసూలు చేసిందంటూ నానా హంగామా చేసారు కానీ 53 కోట్ల షేర్ తో సరిపెట్టుకోవడం విశేషం. ఈ సినిమాకు అటు రామ్ చరణ్ రంగస్థలం, ఇటు మహేష్ భరత్ అనే నేను సినిమాల క్రేజ్ దెబ్బ తీసింది. అల్లు అర్జున్ క్రేజ్ ఏమాత్రం పనిచేయలేదు. మరి నా పేరు సూర్య ఫైనల్ వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం .. షేర్ లలో ..
నైజాం – 12. 60 కోట్లు,
సీడెడ్ – 6. 85 కోట్లు,
వైజాగ్ – 5. 35 కోట్లు,
ఈస్ట్ – 3. 70 కోట్లు,
వెస్ట్ – 2. 85 కోట్లు,
గుంటూరు – 3. 90 కోట్లు,
నెల్లూరు – 1. 65 కోట్లు,
కర్ణాటక – 6. 01 కోట్లు,
తమిళనాడు – 2. 50 కోట్లు,
కేరళ – 2. 25 కోట్లు,
రెస్ట్ అఫ్ ఇండియా – 1. 32 కోట్లు,
ఓవర్సీస్ – 2. 04 కోట్లు,
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కలిపి – 53. 17 కోట్లు.

  •  
  •  
  •  
  •  

Comments