సాటిలైట్ కే షాకిస్తున్న అల్లు అర్జున్ ?

Wednesday, January 17th, 2018, 07:04:24 PM IST

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫస్ట్ ఇంపాక్ట్ విడుదలై సంచలనం రేపిన విషయం ఎలిసిందే. కేవలం 29 గంటల్లో కోటి వ్యూస్ అందుకున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎమోషన్ ఉన్న సోల్జర్ గా అద్భుత నటన కనబరిచాడు. టీజర్ చేస్తూనే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం అవుతుంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సాటిలైట్ హక్కులు క్రేజీ ధరకు పలుకుతున్నాయి. నిజంగా అల్లు అర్జున్ కెరీర్ లో ఇది హయ్యెస్ట్ రేట్ అని చెప్పాలి. ఇప్పటికే పలు పాపులర్ టీవీ ఛానల్స్ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారట .. తాజాగా ఓ పాపులర్ ఛానల్ ఏకంగా 23. 75 కోట్లకు ఈ సినిమా హక్కులు తీసుకుందట ? ఏంటి షాక్ అవుతున్నారా మీరు వింటున్నది నిజమే అయితే ఇందులో ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులతో పాటు డిజిటల్ రైట్స్ కూడా కలుపుకుని ఈ రేంజ్ లో అమ్ముడయ్యాయట !! నా పేరు సూర్య సినిమా అటు బిజినెస్ విషయంలో కూడా భారీ పోటీ నెలకొంది.