స్పెషల్ షోలకు పర్మిషన్ తెచ్చుకున్న సూర్య ?

Wednesday, May 2nd, 2018, 06:58:00 PM IST

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం ఈ నెల 4 న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ప్రత్యేక షో లకోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్మిషన్స్ కోరగా .. అటు ఆంధ్రా, ఇటు తెలంగాణ లో స్పెషల్ షోస్ వేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చేసారు . మీ 4 నుండి 11 డేట్ వరకు ఉదయం 5 గంటల నుండి 10 గంటల మధ్య అదనపు షోస్ వేసుకోవచ్చని పర్మిషన్ రావడంతో అల్లు అర్జున్ ఫాన్స్ ఖుషి అవుతున్నారు. బన్నీ ఆర్మీ అధికారిగా కనిపించే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపడం ఖాయం అని అంటున్నారు జనాలు. ఇక ఇప్పటికే రంగస్థలం , భరత్ అనే నేను సినిమాల జోరుకు సూర్య బ్రేక్ వేసే అవకాశాలు ఉన్నాయి.