మాది ఏ సినిమాకు కాపీ కాదంటున్న దర్శకుడు ?

Tuesday, January 30th, 2018, 10:32:22 PM IST

ఈ మధ్య కొన్ని సినిమాల విషయంలో హాలీవుడ్ సినిమాలకు కాపీలా ఉన్నాయంటూ నానా రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అజ్ఞాతవాసి విషయంలో ఈ రచ్చ ఎక్కువైంది. పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా ఓ ఫ్రెంచ్ సినిమాకు కాపీ అంటూ సదరు ఆ సినిమా దర్శకుడు కూడా ఈ సినిమా విషయంలో కాపి రైట్ కోసం కోర్టు నోటీసులు పంపే ప్లాన్ చేస్తున్నాడు. ఇక తాజాగా అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కూడా ”యాంట్ వోన్ ఫిషర్” అనే ఆంగ్ల చిత్రానికి కాపీ అనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం పై రాద్ధాంతం ఎక్కువ అవుతుండడంతో సినిమా టీమ్ రెస్పాండ్ అయింది. నా పేరు సూర్య సినిమా ఏ సినిమాకు కాపీ కాదని తేల్చి చెప్పారు. ఈ సినిమా విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని స్పష్టం చేసారు యునిట్ సభ్యులు. వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏప్రిల్ 27న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ కాపీ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో చూడాలి.