బన్నీ డైలాగ్ ఇంపాక్ట్ : అన్ని ఇండియాలు లేవురా మనకి.. ఒక్కటే ఇండియా

Sunday, April 8th, 2018, 10:54:06 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భరత్ అనే నేను సినిమాపై ప్రస్తుతం అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫస్ట్ ఇంపాక్ట్ అలాగే పోస్టర్లు సినిమాకు మంచి హైప్ ని క్రియేట్ చేశాయి. అయితే రీసెంట్ గా చిత్ర యూనిట్ డైలాగ్ ఇంపాక్ట్ ను కూడా రిలీజ్ చేసింది. బన్నీ చెప్పిన డైలాగ్ నిజంగా సూపర్బ్ అనేలా ఉంది. సౌత్ ఇండియా కా సాలా అని తిట్టగానే బన్నీ ఇచ్చిన కౌంటర్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. సౌత్ ఇండియా.. నార్త్ ఇండియా.. ఈస్ట్ .. వెస్ట్.. అన్ని ఇండియాలు లేవురా మనకి. ఒక్కటే ఇండియా అంటూ బన్నీ చెప్పిన ఇంపాక్ట్ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూస్తుంటే సినిమా తప్పకుండా రికార్డులు బద్దలు కొట్టేలా ఉందని చెప్పవచ్చు. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా. సమ్మర్ లో మే 4న సినిమా రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.