నా పేరు సూర్య ట్రైలర్ : ఇండియా కావాలి.. ఇచ్చేయ్!

Saturday, April 28th, 2018, 12:51:27 PM IST

స్టైలిష్ స్టార్ కెరీర్ లో ఎంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన నా పేరు సూర్య సినిమా రిలీజ్ డేట్ కోసం ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా బన్నీ దేశ సైనికుడి పాత్రలో కనిపించడం ఆసక్తిని రేపుతోంది. ఇక సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ రీసెంట్ గా రిలీజ్ చేసింది. ఫస్ట్ ఇంపాక్ట్ తో అదరగొట్టిన బన్నీ ట్రైలర్ తో కూడా ఆకట్టుకున్నాడు. ఇదే నీ ఆఖరి బిర్యానీ.. తిన్న తరువాత చంపేస్తాను అని ఎంట్రీ ఇచ్చిన తీరు కేక అనేలా ఉంది. అలాగే బన్నీ పాత్ర ఇందులో చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా లవ్ యాంగిల్ కూడా చాలా రొమాంటిక్ గా ఉంది. రచయిత దర్శకుడిగా మారితే ఇలా ఉంటుందని వక్కంతం వంశీ నిరూపించుకున్నాడు. మాటల్లో కసి కనిపిస్తోంది. అర్జున్ – శరత్ కుమార్ పత్రాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి సినిమా ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక మే 4న నా పేరు సూర్య రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments