నా పేరు సూర్య.. ఓవర్సీస్ లో కష్టమే?

Thursday, May 3rd, 2018, 09:20:11 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నా పేరు సూర్య సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మెగా అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఏపిలో ఉదయం ప్రీమియర్స్ కి అనుమతులు లభించాయి. అయితే ఓవర్సీస్ లో గత కొంత కాలంగా తెలుగు సినిమాలా హావా గట్టిగానే కొనసాగుతోంది. నా పేరు సూర్య సినిమాను కూడా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ప్రీమియర్స్ ని కూడా ప్లాన్ చేయగా అనుకున్నంత రేంజ్ రెస్పాన్స్ అందడం లేదు. అమెరికాలో తెలుగు సినిమాలకు ఉండే ఆదరణ గురించి తెలిసిందే.

అయితే బన్నీ సినిమాని అక్కడి కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నప్పటికీ పెద్దగా బుకింగ్స్ ఏమి రావడం లేదు. కేవలం 10 నుంచి 20 టికెట్ల మధ్యలో అడ్వాన్స్ బుక్ అవ్వడంనిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయం. పైగా ఆఫీస్ పనులు ముగించుకొని ఇళ్లకు వచ్చే సమయమే అయినప్పటికీ ప్రవాసులు బన్నీ సినిమాపై పెద్దగా మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. నా పేరు సూర్యకు మొదట్లో వచ్చిన బజ్ ఇప్పుడు రావడం లేదు. అక్కడ ప్రమోషన్స్ పెద్దగా చేయకపోవడం మైనెస్. అల్లు అర్జున్ కు మార్కెట్ కూడా లోకల్ లో ఉన్నంతగా ఓవర్సీస్ లో లేదు. అలాగే దర్శకుడు వక్కంతం వంశీకి ఇది మొదటి సినిమా కావడంతో అంచనాలు మామూలుగానే ఉన్నాయి. ఎట్రాక్ట్ చేసే విషయాలు లేకపోవడంతో నా పేరు సూర్యకు యూఎస్ లో రెస్పాన్స్ మామూలుగానే ఉంది. రిలీజ్ తరువాత సినిమా మాంచి టాక్ తెచ్చుకుంటే తప్ప ఓవర్సీస్ లో డాలర్లను రాబట్టలేదు. మరి ప్రవాసులను ఎంత వరకు ఈ సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి.

Comments