సూర్య… ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే ?

Saturday, April 14th, 2018, 11:32:43 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా మే 4 న విడుదలకు సిద్ధం అయింది. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి హిట్స్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 29న ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ జరపాలా అన్న విషయం పై ఆలోచనలో పండింది యూనిట్. ఇప్పటికే హైద్రాబాద్ లోని గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియం, లేదా యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ ల పేర్లు పరిశీలించిన మీదట .. ఈ వేడుకను ఎక్కడ చేయాలన్నది నిర్ణయిస్తారట. ఈ లోగా ఆడియో వేడుకను మాత్రం .. తాడేపల్లి గూడెం దగ్గర చేయాలనీ ప్లాన్ చేశారట. తాడేపల్లి గూడెం దగ్గర ఎందుకు ? అన్న సందేహం కలుగుతుందా . ఆ వూరు సమీపంలోనే మిలటరీ మాధవరం అనే ఊరుంది. అక్కడున్న ప్రతి ఇంటినుండి ఒకరు మిలటరీ లో ఉన్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా మిలటరీ అధికారి కావడంతో ప్రీ రిలీజ్ వేడుక అక్కడే చేయాలనీ ప్లాన్ చేసారు.