సూర్య విడుదల వాయిదా పడనుందా ?

Thursday, April 5th, 2018, 10:55:03 AM IST

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం దాదాపు షూటింగ్ పూర్తీ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. భారీ బడ్జెట్ తో తెరక్కెక్కుతూన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ అధికారిగా కనిపించనున్నాడు. ఈ నెల 15 న ఈ చిత్రంలోని పాటలను విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ కొన్ని సన్నివేశానాలు రీ షూట్ చేయమని చెప్పాడట. దాంతో ఈ సినిమా ముందుగా చెప్పినట్టు మే 4 న విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. రీ షూట్ వల్ల డేట్ మారె అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments