అత్యధిక ధరకు అమ్ముడయిన నా పేరు సూర్య శాటిలైట్ రైట్స్ ?

Wednesday, January 17th, 2018, 03:55:44 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తెలుగు తెరకు పరిచయం అవసరం లేని పేరు. ఇంతింతై వటుడింతై అనే రేంజ్ లో అల్లు అర్జున్ తన రేంజ్ ని సినిమా సినిమా కి పెంచుకుంటూ పోతున్నారు. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన నటిస్తున్న నా పేరు సూర్య చిత్ర శాటిలైట్ రైట్స్ 15 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది, ఇప్పటివరకు అల్లు అర్జున్ కెరీర్ లో ఇదే అత్యధిక ధరకు అమ్ముడైన చిత్రం. ఈ చిత్ర హక్కులను ప్రముఖ టెలివిజన్ సంస్థ జీ నెట్వర్క్ దక్కించుకున్నట్లు చెప్తున్నారు. బన్నీ కెరీర్లో పెద్ద హిట్ అయిన సరైనోడు కి శాటిలైట్ రైట్స్ మాత్రం నామమాత్రపు ధరకే అమ్ముడయ్యాయి. అయితే అనూహ్యంగా ఆ చిత్రం ఘాన విజయం సాధించడంతో తదుపరి చిత్రం దువ్వాడ జగన్నాధం 13 కోట్ల కు అమ్ముడయింది. దానిని కూడా జీ వారే దక్కించుకున్నారు. ఆ విధంగా సరైనోడు విజయం తో దిల్ రాజు, దువ్వాడ రైట్స్ కి మంచి లాభం పొందారు. అయితే నా పేరు సూర్య విషయం లో జరిగిన శాటిలైట్ రైట్స్ అమ్మకం ఆ చిత్రం ప్రారంభం రోజే జరిగిందని, ఈ విషయమై జీ సంస్థ వారు కొంత అడ్వాన్స్ కూడా అప్పుడే ముట్టచెప్పారని,దానితాలుకు శాటిలైట్ అగ్రిమెంట్ మొత్తం ఇప్పుడు పూర్తయిందని అంటున్నారు. అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రం లో అను ఇమ్మానుయేల్ హీరోయినిగా నటిస్తోంది, ప్రముఖ కదా రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రం ద్వారా మెగా ఫోన్ పడుతున్నారు. ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ ఇంపాక్ట్ కి ఫాన్స్ ఫిదా అయిపోయారు, ఫస్ట్ లుక్ ఇంపాక్ట్ తర్వాత చిత్రం మీద అంచనాలు మరింత పెరిగాయి …