డీజే దారిలోనేనా .. సూర్య పయనం ?

Tuesday, May 8th, 2018, 10:01:38 PM IST


అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. వక్కంతం వంశీ దర్శకుడిగా మారుతూ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండే డివైడ్ టాక్ తెచ్చుకుంది. సినిమా విషయంలో విమర్శలు ఎక్కువయ్యాయి. ముక్యంగా ఈ ఎఫెక్ట్ కలక్షన్స్ పై పడడంతో సూర్య వల్ల అటు భరత్ కు ఇటు రంగస్థలానికి దెబ్బ పడుతుందని విశ్లేషకులు భావించారు. కానీ విడుదల తరువాత పరిస్థితి తారుమారు అవ్వడంతో ఇప్పుడు సూర్య పరిస్థితి తారుమారైంది. ప్రస్తుతం ఈ సినిమా విషయంలో చెప్పుకుంటున్న కలక్షన్స్ అన్ని ఫేక్ అని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే 85 కోట్ల గ్రాస్ కేవలం మూడు రోజులకే వచ్చిందని చెప్పుకున్నారు. ఈ లెక్కలు చూస్తుంటే ఇదివరకే అల్లు అర్జున్ డీజే విషయంలో జరిగిన పరిస్థితులు రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి. డీజే సినిమాకు కూడా మూడు రోజులకే వందకోట్లు అంటూ నానా హంగామా చేశారు. కానీ సినిమా యావరేజ్ గా మిగిలింది. ఇప్పుడు సూర్య విషయంలో కూడా ఓ మా సినిమా వసూళ్లు ఓ రేంజ్ లో ఉన్నాయంటూ చెప్పుకుంటున్న దానిలో నిజం లేదని .. అందుకే ఈ సినిమా సక్సెస్ మీట్ కోసం పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దింపుతున్నారని అంటున్నారు జనాలు. పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే ఈ సినిమా క్రేజ్ ని మరింత పెంచేలా ఉండడంతో ఆయనను రంగంలోకి దింపుతున్నారు. మరి పవన్ మేనియా సూర్య కు ఎంతవరకు యూస్ అవుతుందో చూడాలి.