క్రేజీ సూర్య‌: 22న ఆడియో, 29న ప్రీరిలీజ్!

Sunday, April 15th, 2018, 12:07:34 AM IST


`నా పేరు సూర్య‌` మే 4న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ వేళ అంత‌కంత‌కు ప్ర‌మోష‌న్స్‌లో వేగం పెరుగుతోంది. లేటెస్టుగా ఈ సినిమాకి సంబంధించి రెండు భారీ ఈవెంట్ల తేదీలు ఖ‌రార‌య్యాయని నిర్మాత ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్ వెల్ల‌డించారు.

వీటిలో ఒక‌టి హైద‌రాబాద్, ఇంకోటి ప‌.గో.జిల్లా- మిల‌ట‌రీ మాధ‌వ‌రంలో ఏర్పాటు చేశామ‌ని చిత్ర‌నిర్మాత ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్ తెలిపారు. భారీగా బ‌న్ని అభిమానుల స‌మ‌క్షంలో అత్యంత ఘ‌నంగా వేడుక‌లు నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు. ల‌గ‌డ‌పాటి మాట్లాడుతూ-“ఈనెల 29న హైద‌రాబాద్‌లో భారీ ప్రీరిలీజ్ ఈవెంట్‌, అంత‌కుముందే ఏప్రిల్ 22న ఆడియో ఈవెంట్‌ని ఘ‌నంగా నిర్వ‌హిస్తాం. ఈ సినిమా త‌ప్ప‌క అంద‌రికీ న‌చ్చుతుంది. విశాల్ -శేఖ‌ర్ ద్వ‌యం అందించిన సంగీతం ఆక‌ట్టుకుంటుంది. చివ‌రి షెడ్యూల్ పూర్తి చేస్తున్నాం. త్వ‌ర‌లో ఇత‌ర‌త్రా వివ‌రాలు తెలియ‌జేస్తాం“ అని తెలిపారు.