బీజేపీ బాట పట్టనున్న నాదెండ్ల – కుమారుడి పరిస్థితి ఏంటి…?

Saturday, July 6th, 2019, 03:01:33 AM IST

కేంద్రంలో రెండవసారి అధికారాన్ని సంపాదించుకున్న బీజేపీ పార్టీ ప్రస్తుతానికి వివిధ రాష్ట్రాల్లో కూడా పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తుంది. ఈమేరకు ఏపీలో కూడా బలోపేతం అయ్యేదిశగా బీజేపీ పార్టీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. కాగా ఇప్పటికే ఏపీపై కన్నేసిన బీజేపీ పార్టీ అందుకు అనుగుణంగా ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఎవరు ఏ పార్టీవారని కూడా చూడకుండా అందరిని కూడా తనతో పాటే కలుపుకుపోడానికి సిద్దమయింది. తాజాగా వీరికి ఓ సీనియర్ మోస్ట్ నాయకుడు చిక్కారు. ఆయనే ఏపీకి నెల రోజుల పాటు సీఎం గా పనిచేసిన నాదెండ్ల భాస్కరరావు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరనున్నారు. నోవాటెల్‌ హోటల్‌లో బీజేపీ చీఫ్ అమిత్‌ షా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు నాదెండ్ల భాస్కర్ రావు.

ఇకపోతే నాదెండ్ల ఈ మధ్య జగన్ సర్కార్ మీద వ్యతిరేక కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో టీడీపీ లో చాలా ముఖ్యమైన కీలక నేతగా వ్యవహరించిన నాదెండ్ల భాస్కర్ రావు, కొన్ని పరిస్థితుల రీత్యా నెల రోజులు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం మనకు తెలిసిందే. కానీ ఇపుడు ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఇకపోతే జనసేన పార్టీలో ఉన్నటువంటి నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ కూడా బీజేపీ లో చేరతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. నాదెండ్ల మమోహర్ గతంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించిన మనోహర్ ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. మరి కొడుకు కోసం గాలం వేయడానికి తండ్రికి పార్టీలో ముందుగా తీసుకుంటున్నారని అంటున్నారు. తమకు అధికారికంగా ఎలాంటి విషయాలు తెలియదు అంటున్న పలువురు నేతలు కూడా నాదెండ్లకు మద్దతుగా ఉండనున్నారని సమాచారం.