ఎంపీ విషయంలోనే హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటే సామాన్యుల పరిస్థితి ఏంటి?

Sunday, May 16th, 2021, 06:03:33 PM IST

MP-Raghurama-Krishnam-Raju
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయం లో వ్యవహరించిన తీరును ప్రజాస్వామ్య విలువల పై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ గర్హించాలి అని అన్నారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు పట్ల అధికారుల తీరును జన సేన పార్టీ ఖండిస్తోంది అని ఆయన అన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగానికి లోబడి వ్యవహరించడం అధికారుల బాధ్యత అని, ఒక ఎంపీ కావొచ్చు, సాధారణ పౌరుడు కావొచ్చు, ఎవరి పట్ల కూడా విచారణ పేరుతో అనుచితంగా వ్యవహరించకూడదు అని చట్టం చెబుతోంది అంటూ చెప్పుకొచ్చారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయం లో నిబంధనలను, చట్టానికి తూట్లు పొడిచారు అధికారులు అంటూ విమర్శించారు.

అయితే ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయం లో హక్కులను కాలరాసినట్లు అర్దం అవుతుంది అని చెప్పుకొచ్చారు. ఒక ఎంపీ విషయం లోనే హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు అంటే సామాన్యుల పరిస్తితి ఏమిటి అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయం లో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును లోక్ సభ స్పీకర్ సుమోటో గా తీసుకోవాలని జన సేన పార్టీ కోరుతోంది అని నాదెండ్ల మనోహర్ అన్నారు. అయితే ఇందుకు ఓం బిర్లా కి లేఖ కూడా రాయనున్నారు.