తండ్రి బాటలోనే నాదెండ్ల మనోహర్ బీజేపీలోకి వెళ్ళనున్నాడా..!

Saturday, July 6th, 2019, 10:14:57 PM IST

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు నేడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిపోయారు. అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా ఉంటూ పార్టీలో క్రియాశీలక నాయకుడిగా పేరు తెచ్చుకుని కాంగ్రెస్ సహాయంతో ఎన్‌టీఆర్ లేని సమయం చూసి ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే నెల రోజులు తిరగకముందే ఎన్‌టీఆర్ యాత్ర చేపట్టి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే అక్కడి నుంచి కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రత్యక్ష రాజకీయాలలో కొనసాగాడే తప్పా మంచి నాయకుడిగా పేరు సంపాదించలేకపోయాడు.

అయితే అలాంటి సమయంలో నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ రాజకీయ రంగ ప్రవేశం చేసారు. అయితే ఈయన రెండు సార్లు తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్‌గా కూడా పనిచేసారు. అయితే ఈ ఎన్నికలల్ సమయంలో నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరారు. అయితే జనసేన నుంచి పోటీ చేసిన ఈయన ఈ ఎన్నికలలో ఓటమి పాలయ్యాడు. అయితే జనసేన ఘొర ఓటమి పాలవ్వడంతో ముందు నుంచి పార్టీ మారుతున్నాడు అని వార్తలు వినబడినా వెంటనే పార్టీ మారితే ప్రజలలో తప్పుడు సంకేతం వెల్తుందని ఆగిపోయాడు. అయితే ఇప్పుడు తాజాగా తన తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు బీజేపీలో చేరిపోవడంతో ఇక నాదెండ్ల మనొహర్ కూడా త్వరలోనే జనసేనను వీడి బీజేపీలో చేరిపోతారంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పార్టీ మార్పుపై నాదెండ్ల మనోహర్ మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.