పవన్ దీక్షకు తరలిరండి.. నాదెండ్ల పిలుపు..!

Tuesday, December 10th, 2019, 12:19:23 AM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 12న కాకినాడలో రైతులకు బాసటగా నిలిచేందుకు నిరాహారదీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన చేశారు. రాష్ట్ర రైతుల కష్టాలు తెలుసుకొని, వారికి అండగా నిలబడేందుకు పవన్ చేపట్టనున్న దీక్షకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.

అయితే రైతుల కష్టాలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వారికి బాసటగా నిలించేందుకు ఒక రోజు దీక్ష చేయడానికి పూనుకున్నారని, ఈ నెల 12వ తేదీ ఉదయం 8 గంటలకు కాకినాడలో నిరసన దీక్ష చేయనున్నట్టు తెలిపారు. అన్నదాత పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతు సమస్యలను పూర్తిగా విస్మరించడంతో ఏపీలో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఈ దీక్షను విజయవంతం చేసి ప్రభుత్వానికి రైతుల కష్టాలు కనిపించేలా చేయాలని జనసైనికులకు విజ్ఞప్తి చేశారు.