నాదెండ్ల చివరివరకు మాతోనే ఉంటారు – తేల్చేసిన జనసేన

Sunday, June 9th, 2019, 02:01:47 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరులో జనసేన నేతలతో ఒక సమీక్ష నిర్వహించారు. కాగా ఈ సమీక్షకు జనసేన పార్టీ కీలక నేత అయినటువంటి నాదెండ్ల మనోహర్ హాజరు కాలేదు. కాగా నాదెండ్ల సమీక్షకు హాజరు కాకపోవడంతో జనసేనను నాదెండ్ల వీడతాడంటూ ప్రచారం జరుగుతుంది. కాగా ఈ విషయం పై స్పందించిన జనసేన పార్టీ నాదెండ్ల మనోహర్‌ అమెరికా పర్యటనలో ఉన్నారని, అందుకనే గుంటూరు సమీక్షకు హాజరు కాలేదని, కావాలనే కొందరు నాదెండ్ల మీద దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా నాదెండ్ల జనసేన పార్టీని వీడబోడని, చివరి వరకు కూడా జనసేన పార్టీలోనే కొనసాగుతాడని స్పష్టం చేసింది జనసేన పార్టీ. అంతేకాకుండా వదంతులను నమ్మొద్దని, ఏమైనా ఉంటే మేమె అధికారికంగా వెల్లడిస్తామని పార్టీ స్పష్టం చేసింది. జనసేన నుండి పోటీ చేసి ఓటమి చెందిన నేతలు కొందరు పార్టీ మారడంతోనే ఇలాంటి వదంతులు వ్యాపిస్తున్నాయని జనసేన పార్టీ నేతలు అంటున్నారు. కాగా నాదెండ్ల మనోహర్‌ గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.