షాక్ … కాజల్ – తమన్నాలపై బహిష్కరణ వేటు ?

Thursday, January 26th, 2017, 11:45:03 AM IST

kajal-tamanna
సౌత్ లో టాప్ హీరోయిన్స్ గా ఇమేజ్ తెచ్చుకున్న అందాల భామలు కాజల్ అగర్వాల్, తమన్నాల హవా జోరుగా కొనసాగుతుంది. అయితే వారి కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఆ వివరాల్లోకి వెళితే .. తమన్నా, కాజల్, అమీ జాక్సన్ లను తమిళ సినిమా రంగంనుండి బహిష్కరించాలని నడిగర్ సంగం పై కొందరు ఒత్తిడి తెస్తున్నారట. దానికి కారణం పేట, జల్లికట్టును నిషేధించాలన్న పోరాటం కారణంగా తమిళనాడులో ‘పేట’ సంస్థను తీవ్రవాద సంస్థగా భావిస్తున్నారు అక్కడి జనాలు? ఆ సంస్థ తో సంబంధం ఉన్న వారిపై తమిళులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాజల్, తమన్నా, అమీ జాక్సన్ లు ఇంకా పెటా లో సభ్యులుగా ఉన్నారని అందుకనే వారిని తమిళ పరిశ్రమనుండి బహిష్కరించాలని తీవ్ర ఒత్తిడి తెస్తున్నారట !! సో ఈ ఒత్తిడి నేపథ్యంలో కాజల్, తమన్నా లకు నోటీసులను ఇవ్వాలని నడిగర్ సంగం ఆలోచింస్తుందట. మరి ఈ విషయం తెలిసి .. కాజల్, తమన్నాలు తమిళ ప్రజల ఒత్తిడికి తలొగ్గి పేట నుండి వైదొలుగుతారో .. లేక తమిళ పరిశ్రమకు బాయ్ చెబుతారో చూడాలి?