నాగ్ – నాని బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌?

Tuesday, April 17th, 2018, 07:55:26 PM IST

కింగ్ నాగార్జున‌- నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ ఇటీవ‌లే ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. వైజ‌యంతి మూవీస్ ప‌తాకంపై అశ్వ‌నిద‌త్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఆదిత్య శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్ద‌రు క‌థానాయిక‌ల్ని ఎంపిక చేసుకున్నారు. నాగ్, నాని క‌థానాయిక‌లు ఫిక్స‌య్యార‌ని, న‌వ‌త‌రం నాయిక‌ శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్‌ క‌థానాయిక‌గా ఫైన‌లైంద‌ని వార్త‌లొచ్చాయి.

అయితే ఈ సినిమాలో నాగార్జున‌, నాని పాత్ర‌ల వివ‌రాలేంటి? అని ప‌రిశీలిస్తే, కొన్ని ఆసక్తిక‌ర సంగ‌తులు తెలిశాయి. ఇదివ‌ర‌కూ `ఊపిరి`లో నాగ్‌- కార్తీ గురు శిష్యులుగా న‌టించారు. వీల్‌ఛైర్‌కి అంకిత‌మైన నాగార్జున‌కు సేవ‌లు చేసే డ్రైవ‌ర్‌గా కార్తీ న‌టించాడు. నాగ్ – నాని మ‌ల్టీస్టార‌ర్‌లో క‌థానాయ‌కులు బ్ర‌ద‌ర్స్‌గా క‌నిపిస్తార‌ని తెలుస్తోంది. అంటే అన్న‌ద‌మ్ముల సెంటిమెంట్ నేప‌థ్యంలో ఈ సినిమా క‌థాంశం ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది. అంతేకాదు.. 1999లో రిలీజైన క్లాసిక్ హాలీవుడ్ మూవీ `అన‌లైజ్ దిస్‌` స్ఫూర్తితో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఇందులో రోబెర్ట్ డీ నీరో పోషించిన డాన్ పాత్ర‌లో నాగార్జున న‌టిస్తుంటే, డాన్‌కి బ్ర‌ద‌ర్ గా బిల్లీ క్రిస్ట‌ల్ పోషించిన డాక్ట‌ర్ పాత్ర‌లో నాని న‌టించ‌నున్నాడ‌ని తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments