అఖిల్ 3 సినిమా పై నాగ్ అసంతృప్తి ?

Saturday, September 15th, 2018, 10:47:34 AM IST

అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో నాగ్ ఫైర్ అవుతున్నాడట. ఈ సినిమా కోసం పక్క స్క్రిప్ట్ సిద్ధం చేయలేదని తెలిసి నాగ్ ఫైర్ అయ్యాడట. అయితే ఈ సినిమా విషయంలో అఖిల్ సొంతంగా నిర్ణయం తీసుకున్నాడు. వెంకీ చెప్పిన కథ నచ్చి ఓకే చేసాడు అఖిల్ అయితే పూర్తిగా బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేయకుండా దర్శకుడు షూటింగ్ మొదలు పెట్టినట్టు తెలిసింది.

ఇప్పటికే అఖిల్ హీరోగా నటించిన రెండు సినిమాలు పెద్దగా ఆశించిన స్థాయి సక్సెస్ రాకపోవడంతో కనీసం ఈ సినిమాతో అయినా హిట్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ సినిమా విషయంలో అఖిల్ అండ్ టీమ్ సీరియస్ గా లేకపోవడంతోనే నాగ్ కోపంగా ఉన్నాడట. అన్నట్టు ఈ చిత్రానికి మిస్టర్ మజ్ను అనే టైటిల్ పెడుతున్నారు. మరి ఈ సినిమా విషయంలో నాగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments