బంగార్రాజుకు సన్నాహాలు మొదలయ్యాయి ?

Tuesday, June 12th, 2018, 10:09:44 AM IST

అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బంగార్రాజు గా నాగ్ బాగా ఆకట్టుకున్నాడు. ఈ పాత్ర ఆయనకు బాగా నచ్చేసింది దాంతో బంగార్రాజు టైటిల్, పాత్రతో సీక్వెల్ చేయాలనీ ప్లాన్ చేసాడు. అప్పట్లో వేరే కమిట్మెంట్స్ వల్ల కుదరలేదు కానీ .. తాజాగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. బంగార్రాజు టైటిల్ తో తెరకెక్కే ఈ సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం అయిందట. త్వరలోనే నాగార్జునతో కథ చెప్పి ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నాడు. నాగార్జున కూడా ఆఫీసర్ సినిమా దెబ్బ కొట్టడంతో ఇప్పుడు మంచి హిట్ సినిమా కావాలి కాబట్టి బంగార్రాజు చేసేందుకు ఓకే చెప్పే అవకాశం ఉంది.