నాగార్జున సినిమా హక్కులు అమెజాన్ చేతికి ?

Wednesday, March 7th, 2018, 10:54:08 PM IST

ఈ మధ్య తెలుగు, హిందీ, తమిళ సినిమాలకు సంబందించిన డిజిటల్ హక్కులను ప్రముఖ ఛానల్ అమెజాన్ సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ కంపెనీ అందరికంటే ఎక్కువ మొత్తానికే సదరు సినిమాలకు సంబందించిన డిజిటల్ హక్కులను తీసుకుంటూ ఆ సినిమాకు మరింత క్రేజ్ తీసుకొస్తుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా డిజిటల్ హక్కులు ఏకంగా 30 కోట్లకు కొనేసిన అమెజాన్ సంస్థ తాజాగా నాగ్ ఆఫీసర్ హక్కులు కొనేసింది. సంచలన దర్శకుడు వర్మ తెరకెక్కిస్తున్న ఆఫీసర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబై లో జరుగుతుంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల విషయంలో అప్పుడే పోటీ ఏర్పడగా .. అమెజాన్ సంస్థ భారీ మొత్తానికి ఈ హక్కులు తీసుకున్నదట !! ఆ రేట్ ఎంతంటే ఆ సినిమా బడ్జెట్ తో సమానమని వార్తలు వస్తున్నాయి. సినిమా విడుదల తరువాత కేవలం రెండో వారంలోనే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ప్రదర్శిస్తారట. మొత్తానికి నాగార్జున సినిమా డిజిటల్ హక్కుల విషయంతో ఈ సినిమా పై అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి.