వర్మ ఆశలను ఆఫీసర్ నెరవేరుస్తాడా ?

Friday, May 11th, 2018, 10:41:22 PM IST


సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తున్న ఆఫీసర్ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాకోసం నాగార్జున అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య వరుస పరాజయాలతో తన ఇమేజ్ డామేజ్ చేసుకున్న వర్మకు ఖచ్చితంగా హిట్ కావాలి అందుకనే .. నాగార్జునతో ఈ సినిమా చేస్తున్నాడు. రేపు ట్రైలర్ విడుదల కానుంది. ఈ సినిమా పై అటు వర్మ కూడా చాలా ఆశలే పెట్టుకున్నాడు. మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపిస్తున్నాడు. అయన సరసన నూతన హీరోయిన్ మైరా సరీన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయాలనీ ప్లాన్ చేసారు. ప్రస్తుతం ఆఫీసర్ కోసం వేరే ఏ సినిమా పోటీకి రాకపోవడంతో దైర్యంగా ఆఫీసర్ ని విడుదల ప్లాన్ చేసినట్టున్నారు.