నాని దర్శకుడికి ఓటేసిన నాగ చైతన్య ?

Tuesday, January 23rd, 2018, 12:00:07 PM IST

అక్కినేని నాగ చైతన్య సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ తన క్రేజ్ పెంచుకునే పనిలో ఉన్నాడు. అందుకే భిన్నమైన కథనాలను ఎంచుకుంటూ కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి చిత్రంతో పాటు మారుతీ దర్శకత్వంలో శైలజ రెడ్డి అల్లుడు చిత్రంలో నటిస్తున్న నాగ చైతన్య మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఆ దర్శకుడు ఎవరో కాదు .. ఈ మద్యే నాని హీరోగా నిన్ను కోరి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయినా శివ నిర్వాణ !! శివ మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు నానికి మంచి కమర్షియల్ విజయాన్ని అందించాడు. తాజాగా శివ చెప్పిన కథ నచ్చడంతో చైతు ఓకే చెప్పాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీ అయినా శివ నిర్వాణ మరో వైపు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. సో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నట్టు ఈ చిత్రాన్ని కూడా శివతో నిన్ను కోరి చిత్రాన్ని నిర్మించిన డివివి దానయ్య నిర్మిస్తాడట.