ప్రేయసి అంటున్న నాగ చైతన్య ?

Saturday, March 3rd, 2018, 11:51:15 AM IST

అక్కినేని నాగ చైతన్య హీరోగా మరో సినిమాకు ఓకే చెప్పాడు. ఇప్పటికే చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమాలో నటిస్తున్నాడు, మరో వైపు మారుతి దర్శకత్వంలో శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో కూడా నటిస్తున్న అయన తాజాగా నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. డివివి దానయ్య నిర్మించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇందులో అయన సతీమణి సమంత హీరోయిన్ గా నటిస్తుండగా .. టైటిల్ కూడా ప్రేయసి అని ఖరారు చేస్తున్నారట. ఏప్రిల్ లో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.