చై ప‌చ్చ‌బొట్టులో టాప్ సీక్రెట్స్‌

Wednesday, May 30th, 2018, 05:25:38 PM IST

అక్కినేని నాగచైత‌న్య మోచేతిపై టాట్టూ ఒక‌టి ప్ర‌స్తుతం యువ‌త‌రంలో హాట్ టాపిక్‌. అత‌డి చేతిపై ప‌చ్చ‌బొట్టులో ఏదో ర‌హ‌స్యం దాగి ఉంద‌నే డిబేట్ గాళ్స్‌లో న‌డుస్తోంది. ఆ టాట్టూలో ఉన్న ర‌హ‌స్యం క‌నిపెట్టేందుకు అమ్మాయిలు నానా తంటాలు ప‌డుతున్నారు. అది త‌న ప్రేయ‌సి స‌మంత గురించి రాసుకున్న‌దా? లేక లైఫ్‌లో ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని ఓ గొప్ప అనుభూతి గురించి రాసుకున్నదా? అన్న క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది.

అయితే ఆ టాట్టూ కోడ్‌ని అనూహ్యంగా డీకోడ్ చేసేశాడో ఫ్యాన్‌. అస‌లు ఆ మోల్ కోడ్‌లో ఉన్న‌ది పెళ్లిరోజు తారీఖు అంటూ క‌నిపెట్టేశాడు అభిమాని. దానికి సామ్ సామాజిక మాధ్య‌మంలో త‌న‌దైన శైలిలో స్పందించింది. వ్వావ్ .. తెలుసుకోవాల‌న్న నీ ఆస‌క్తి ఆక‌ట్టుకుంది.. సూప‌ర్భ్ అంటూ ఆన్స‌ర్ చేసింది. అయితే అస‌లు ఆ కోడ్ లాంగ్వేజ్‌లో ఉన్న‌ది పెళ్లి తేదీయేనా? కాదా? అన్న‌ది మాత్రం సామ్ చెప్పనేలేదు. చై-సామ్‌ పెళ్లి రోజు 6-10-17. దీనినే చైతూ ప‌చ్చ‌బొట్టు పొడిపించుకున్నాడా?

  •  
  •  
  •  
  •  

Comments