నేను చేసిన చెత్త సినిమాలు అవే: నాగ చైతన్య

Wednesday, September 12th, 2018, 04:58:02 PM IST

జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు నాగచైతన్య. ప్రస్తుతం ఈ హీరో శైలజా రెడ్డి అల్లుడు సినిమా ప్రమోషన్ లో తెగ బిజీగా ఉన్నాడు. ఎన్నడూ లేని విధంగా ప్రచారాలలో పాల్గొంటూ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. అసలు విషయంలోకి వస్తే.. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతు ఎవరు ఊహించని విధంగా తన కెరీర్ లో చెత్త సినిమాలు అవి రెండే అని నిర్మొహమాటంగా చెప్పేశాడు.

2011 లో 100% లవ్ తరువాత వరుసగా చేసిన దడ, బెజవాడ సినిమాలే తన కెరీర్ లో చెత్త సినిమాలని ఆ సినిమాలు చేసినందుకు ఇప్పటికి కూడా బాధపడుతూ ఉంటానని చైతు ఓపెన్ గా చెప్పేశాడు. ఇక తన కెరీర్ లో ఇప్పటివరకు బెస్ట్ సినిమా ఏదంటే ప్రేమమ్ అని చెబుతానని చైతు క్లారిటీ ఇచ్చాడు. ఇక శైలజా రెడ్డి అల్లుడు సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తప్పకుండా ఈ ఫెస్టివల్ కి అందరికి నచ్చుతుందని కూడా అక్కినేని వారసుడు తెలిపాడు. మారుతీ దర్శకత్వం వహించిన ఆ సినిమా గురువారం భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

  •  
  •  
  •  
  •  

Comments